హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూలిన గోడతో భయాందోళన

SRD: జహీరాబాద్ పట్టణంలోని మార్కెట్ ఆవరణలోని గిడ్డంగి శిథిలావస్థకు చేరి ఓ వైపు గోడకూలి పోయింది. దీంతో అందులోకి పశువులు, మేకలతో పాటు మూత్రవిసర్జనకు స్థానికులు వెళ్తున్నారు. శిథిలమైన ఆ భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరగకముందే అధికారులు చొరవ తీసుకుని కూలిన వైపు గోడ కట్టాలని, లేదంటే మొత్తం కూల్చివేయాలని కోరుతున్నారు.