ASF: లింగంపల్లి మండలంలోని అన్ని తండాలు, గూడాల్లో గురువారం పొలాల అమావాస్య, బసవన్నల పండుగను రైతులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను శుభ్రంగా కడిగి, కొమ్ములను రంగులు వేసి, మెడలో గజ్జలు, జూలాలు, కొత్త గొంగళ్లతో అందంగా అలంకరించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు


