NRML: గోదావరి పుష్కరాల పనులను అన్ని శాఖలు సమన్వయంతో చేపట్టి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు పెద్ద భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గురువారం కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష


