హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా

SRPT: ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నందాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 200-250 కంపెనీలను ఆహ్వానించి వేలాది ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.