హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య..

BDK: భద్రాచలం జగదీశ్ కాలనీకి చెందిన అనుగోజు ప్రభాకర్ (27) శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు ఇండస్ట్రియల్ ఏరియాలో కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగానే బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.