NLG: నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగం సిబ్బంది 11 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అభయ మేన్‌పవర్ సప్లయర్స్ జీతాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ, వెంటనే బకాయి జీతాలు చెల్లించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆరోగ్యశ్రీ సిబ్బందికి 11 నెలలుగా జీతాలు బకాయి!


