KMM: ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాల ఆన్‌లైన్ నమోదు గడువును ఈనెల 17 వరకు పొడిగించినట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు బిల్లులతో డీలర్ల వద్ద నమోదు చేయించుకోవాలన్నారు. సొంత విత్తనాలైతే ఏఈఓలను సంప్రదించాలన్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే 500 బోనస్ అందుతుందని డీఏఓ తెలిపారు.
తెలంగాణ
ఈనెల 17 వరకు గడువు పొడగింపు


