హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.536 టీఎంసీల నీరు

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరిలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో శుక్రవారం ఉదయం 6 గంటలకు 1.536 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం 389.07 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి ఎలాంటి నీటి ప్రవాహం లేకపోగా, దిగువకు కూడా నీటి విడుదల లేదు. ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు మాత్రమే వినియోగమవుతోంది. పంప్‌హౌస్‌లో పంపులన్నీ నిలిచివున్నాయని అధికారులు తెలిపారు.