హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రణాళికాబద్ధంగా సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

BDK: జిల్లాలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్న భూభారతి రీసర్వే, సాదా బైనామా, రెవెన్యూ సదస్సులను క్యాంప్‌ మోడ్‌లో నిర్వహించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ప్రణాళికాబద్ధంగా, నిబద్ధతతో అధికారులు సర్వే బృందాలతో కలిసి పనిచేసి ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలన్నారు. సర్వేయర్లు, లైసెన్స్‌ సర్వేయర్లు, IKP సర్వేయర్లు రీసర్వేను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.