NLG: జిల్లాలోని నిరుద్యోగ బీసీ మహిళలకు 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్' పథకం కింద 100% సబ్సిడీతో ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించనున్నట్లు బీసీ సంక్షేమాధికారి ఎ. సంజీవయ్య తెలిపారు. 18-55 ఏళ్ల వయస్సు, కనీసం 5వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. ఆసక్తి గల మహిళలు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరారు.
తెలంగాణ
ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం


