MDK: జిల్లాలో నేడు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే వీలుందని తెలిపింది. వాతావరణ మార్పుల పట్ల ప్రజలు హెచ్చరికలు పాటించాలని, పొలాల్లో పనిచేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాలో ఉరుములు,మెరుపులతో వర్షాలు


