హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ప్రభావంతో ఎండిపోతున్న పొలాలు!

NLG: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో బోర్ల నుంచి నీరు కూడా తక్కువగా పోయడంతో వేసిన వరి పంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఆగామోత్కూర్, గురప్పగూడెం, బొమ్మకల్ తదితర గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.