హైదరాబాద్: 28°C
తెలంగాణ

​రామాయంపేటలో నేడు యూరియా పంపిణీ

MDK: రామాయంపేట మండలంలో ఇవాళ రైతులకు యూరియా లభ్యమవుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. స్థానిక మన గ్రోమోర్ కేంద్రం ద్వారా యూరియా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8:30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మండలంలోని రైతులందరికీ సరిపడా యూరియాను స్టాక్ అందుబాటులో ఉంచామన్నారు.