హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాండ్‌లో అపరిశుభ్రత.. ప్రజల ఆందోళన

MDK: నర్సాపూర్‌లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ఆవరణలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. వీటిల్లో ప్రయాణికులు మల మూత్ర విసర్జన చేస్తుండగా పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల ప్రయాణ ప్రాంగణం ఆవరణలోనే పొదల మాటున ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ నేపథ్యంలో చీకటి పడిందంటే ప్రాంగణంలో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. పొదలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.