హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ

BHPL: మహదేవపూర్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురువారం మహదేవపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మట్టి గణపతి విగ్రహాల తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు పర్యావరణ హిత గణపతి విగ్రహాలను రూపొందించారు. “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం” అనే సందేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.