హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలి'

BHPL: రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆధునిక, లాభదాయక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. గురువారం రేగొండ మండలం కొడవటంచ శివారులో ఉపాధి హామీ పథకం కింద నీటి కుంట పనులను ప్రారంభించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.