హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండంతస్తుల అనుమతి.. నాలుగు అంతస్తుల నిర్మాణమా?

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని భవనాలకు నోటీసులు ఇచ్చినా నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు అంటున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే పనులు నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గిరీష్ తెలిపారు.