హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

JN: లింగాలఘనపురం మండలంలోని వనపర్తి గ్రామానికి చెందిన యశ్వంత్‌ (24) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న యశ్వంత్‌ కుటుంబ పనుల అనంతరం ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా భువనగిరి సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.