హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి'

NZB: వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్​లో గురువారం కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఖరీఫ్ పంట సేకరణకు ఇబ్బందులు లేకుండా గోడౌన్‌లలో నిల్వ ఉన్న బియ్యాన్ని నిర్దేశిత ప్రాంతాలకు త్వరగా తరలించాలని సూచించారు.