హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కుట్టు మిషన్లకు ఈనెల 15 చివరి తేదీ

WNP: BC మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల కోసం దరఖాస్తులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆధార్, BC కుల ధృవీకరణ పత్రం, ఫొటో సమర్పించాలని పేర్కొన్నారు. అర్హతల పరిశీలన అనంతరం లబ్ధిదారులను ఎంపిక చేస్తారని తెలిపారు. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 15లోగా TG OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు సమయంలో వివరాలను సరిగా నమోదు చేయాలన్నారు.