హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్.. 86 మందికి శిక్షలు

KMR: మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని జిల్లా పోలీసులు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 86 మందిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం శిక్షలు వేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో ముగ్గురికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.1,30,800 జరిమానా విధించిందన్నారు.