ADB: భోరజ్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం పొలాల అమావాస్య పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రైతులు తమ బసవన్నలను రంగుల వస్త్రాలు, బెలూన్లతో అలంకరించి, డప్పు చప్పుళ్లతో ఊరేగించారు. హనుమాన్ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ సందర్భంగా రైతులు ఆకాంక్షించారు.
తెలంగాణ
ఘనంగ పొలాల అమావాస్య


