హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకోటలో చెక్ పవర్ పంచాయితీ!

WNP: గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య చెక్ పవర్ వివాదం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారుతోంది. కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామస్థులు నిరసన చేపట్టారు. నిధుల ఖర్చుకు ఇద్దరి సంయుక్త సంతకాలు తప్పనిసరి కావడంతో సమన్వయం లేకపోతే బిల్లుల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఒకే పార్టీ, మరికొన్ని చోట్ల వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఉండటంతో విభేదాలు తలెత్తుతున్నాయి.