హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

HNK: కాజీపేట మండలం అమ్మవారిపేట చెరువులో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. కడిపికొండకు చెందిన రొంట వెంకటేశ్వర్లు రెడ్డి అలియాస్ చింటూ (27) మంగళవారం చేపల వేటకు వెళ్లి తిరిగి రాలేదు. గురువారం చెరువులో మృతదేహం లభ్యం. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ కిషన్ తెలిపారు.