హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి రవాణాకు అడ్డుకట్ట.. ఇద్దరి అరెస్టు

NZB: నాందేడ్‌ నుంచి నిజామాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో 6 టౌన్ పోలీసులు జన్నేపల్లి రైల్వే గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద కారును తనిఖీ చేయగా 4 కిలోల గంజాయి లభించింది. నాందేడ్‌కు చెందిన రాజేందర్, సద్దాంను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు SI సందీప్ తెలిపారు.