WGL: వరంగల్ ఎనుమాముల పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ వాంకుడోతు అశోక్ (25) మృతి చెందాడు. ఈ నెల 7న ఫొటోషూట్‌కు వెళ్లిన అశోక్ తిరిగి రాలేదు. గురువారం ఆరెపల్లి వ్యవసాయ కళాశాల సమీపంలోని పొదల్లో మృతదేహం గుర్తించారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భార్య సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి


