హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యుత్ స్తంభాలకు యూనిక్ పోల్ నంబరింగ్'

ఆసిఫాబాద్ జిల్లాలో విద్యుత్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు యూనిక్ పోల్ నంబరింగ్ చేపట్టినట్లు ఎస్ఈ ఉత్తమ్ జాడె ప్రకటనలో తెలిపారు. 33 కేవీ స్తంభాలకు 90%, 11 కేవీ స్తంభాలకు 50% నంబరింగ్ పూర్తయిందన్నారు. అంతరాయం ఏర్పడినప్పుడు పోల్ నంబర్ ఆధారంగా ఖచ్చితమైన లొకేషనన్ గుర్తించి సిబ్బందిని పంపి సమస్యను త్వరగా పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.