హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నకిలీ ఎరువుల దందా గుట్టు రట్టు

VKB: జిల్లాలో అక్రమార్కులు అన్నదాతలకు సున్నం పెట్టారు. డీఏపీ పేరుతో బూడిదను అంటగట్టి బురిడీ కొట్టించారు. జిల్లాలోని ఐదు మండలాల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో తయారైన నకిలీ ఎరువులను అంబర్‌పేట నుంచి లారీలలో జిల్లాకు తరలించారు. రైతుల ఫిర్యాదులతో అధికారులు ల్యాబ్‌కు పంపగా అది ఎరువు కాదు బూడిద మాత్రమేనని తేలింది.