హైదరాబాద్: 28°C
తెలంగాణ

జ్ఞాన భారత్ మిషన్‌కు సహకరించాలి: కలెక్టర్

GDWL: జిల్లా ప్రాచీన సాహిత్యం, చరిత్రను డిజిటలైజేషన్ చేసేందుకు జ్ఞాన భారత్ మిషన్కు పరిశోధకులు సహకరించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో కోరారు. సమాచారం, తాళపత్రాలు ఉన్నవారు ఈనెల 11న మధ్యాహ్నం 3 గంటలకు MALD డిగ్రీ కళాశాలలో జరిగే జిల్లా కమిటీ సమావేశానికి హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.