హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అర్ధరాత్రి దొంగల హల్‌చల్

SRD: మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాజ్ రెస్టారెంట్ వెనుక ఊరికి దూరంగా ఉన్న 8 ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు క్లూస్ టీమ్‌తో రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ వరుస చోరీలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.