హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా నిధులు మంజూరు చేసిన: డీఈవో

SRD: విద్యార్థుల్లో క్రీడా జ్యోతిని వెలిగించేందుకు జిల్లాలోని సర్కారు బడులకు స్పోర్ట్స్ గ్రాంట్ నిధులు విడుదలయ్యాయని డీఈవో రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆటస్థలం ఉన్న 826 పాఠశాలలకు రూ. 91.25 లక్షలు, స్థలం లేని 292 బడులకు రూ.11.74 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో వెంటనే ఆటల సామగ్రిని కొనుగోలు చేసి, క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని హెచ్‌ఎంలకు సూచించారు.