హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

SRD: అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వైఖరిని ఎండగడుతూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు సిద్ధమయ్యాయి. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.