హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువజన సమాఖ్య రాష్ట్ర సభ్యుడిగా మహేష్

SDPT: యాదగిరిగుట్టలో జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య తెలంగాణ 3వ రాష్ట్ర మహాసభల్లో బెజ్జంకికి చెందిన దొంతరవేణి మహేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండల సీపీఐ కార్యదర్శి రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, యువజన సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు నిరంతరం కృషి చేయాలని కోరారు.