హైదరాబాద్: 28°C
తెలంగాణ

NSUI కొత్త అధ్యక్షుడు ప్రశాంత్

SDPT: NSUI సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా రాచకొండ ప్రశాంత్ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు యెడవెల్లి వెంకటస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి ప్రశాంత్ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసమే తన ప్రాధాన్యమని, వారి తరఫున అహర్నిశలు శ్రమిస్తూ పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.