హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై భారీ జరిమానా

SRCL: ఇల్లంతకుంటలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 58 మందిని సిరిసిల్ల కోర్టులో హాజరుపరిచారు. కేసులను విచారించిన జిల్లా న్యాయమూర్తి నిందితులకు కలిపి రూ.1.36 లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్‌ సమయంలో మద్యం సేవిస్తే ప్రమాదాలకు దారితీస్తుందని ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని సూచించారు.