హైదరాబాద్: 28°C
తెలంగాణ

22ఏ భూములపై బీజేపీ ఆందోళన

KNR: కరీంనగర్‌లో 22ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించాలని బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎంఆర్‌ఓ రాజేశ్‌కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ నిర్ణయాలతో అనేక భూములు నిషేధిత జాబితాలో చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హులైన భూ యజమానులకు న్యాయం చేయాలని కోరారు.