హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధునిక సాంకేతికతపై కమిషనర్ అధ్యయనం

KNR: ముంబైలో నిర్వహిస్తున్న IFAT ఇండియా-2026 అంతర్జాతీయ ప్రదర్శనను కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు. నగర పాలనలో కీలకమైన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం, తాగునీటి సరఫరాకు సంబంధించిన అధునాతన సాంకేతికతలను పరిశీలించారు. నిపుణులతో చర్చించి, కరీంనగర్‌లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడే వినూత్న విధానాలను తెలుసుకున్నారు.