హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయుధాగారాల భద్రతపై సీపీ సమీక్ష

KNR: పోలీస్ కమిషనరేట్‌లోని ఆయుధాగారంతో పాటు 9వ తెలంగాణ ఎన్‌సీసీ బెటాలియన్ ఆయుధాగారాన్ని సీపీ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వ, భద్రత, రికార్డులను పరిశీలించారు. ఆయుధాలను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయాలని, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అడ్మిన్ ఏఎస్సై శ్రీధర్‌రెడ్డి, సిబ్బందికి సూచించారు.