MHBD: పొలానికి నీరు పారించేందుకు వెళ్లిన బోడ సూర్య(42) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కేసముద్రం మండలం బోడమంచ్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుడితండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది.పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య అనిత, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తెలంగాణ
వ్యవసాయ బావిలో జారిపడి రైతు మృతి


