హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్సై

NGKL: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఊర్కొండ ఎస్సై రమాదేవి గ్రామ పెద్దలు, నిర్వాహకులకు సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి లేదని అన్నారు. ఉత్సవాల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.