హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యం'

AKP: కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎలమంచిలి మండలం సోమలింగంపాలెం అర్బన్ పీహెచ్ నోడల్ అధికారి డాక్టర్ షేక్ అమీర్ షాజిద్ తెలిపారు. ఎలమంచిలి ఎస్సీ కాలనీలో గురువారం గృహ సందర్శన చేసినట్లు తెలిపారు. ఈనెల 11వ తేదీ నుంచి కుష్టు వ్యాధి నిర్ధారణ కోసం సర్వే ప్రారంభిస్తామన్నారు. ఈ వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడానికి అవగాహన కల్పిస్తామన్నారు.