ATP: ఆత్మకూరు పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో HNSS కాలువ వద్ద దాడి చేసి 1.5 కిలోల గంజాయి, 2 బైకులు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కాకిమాని రాజు, నల్లబోతుల సుంకన్న, ఎడవాల మహేష్‌తో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు మహేష్‌పై గతంలో రెండు హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్


