కృష్ణా: చల్లపల్లి ఎస్సై డి. దుర్గాంజనేయులు సిబ్బందితో కలిసి ఇవాళ నడకుదురు కట్ట పేకాట శిబిరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట శిబిరంపై పోలీసుల దాడి


