ప్రకాశం: ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీలకు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని విస్మరించిందని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేందర్రావు ఆరోపించారు. గురువారం ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ఇతర వర్గాలకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూనే నిరుపేద ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ, ఎస్టీ పెన్షన్ల హామీ విస్మరణ


