ATP: కూటమి ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. కంబదూరు, కళ్యాణదుర్గం ప్రాజెక్టుల పరిధిలోని 38 మందికి అంగన్వాడీ ఆయాల నియామక పత్రాలను ప్రజావేదికలో ఆయన అందజేశారు. గత వైసీపీ ప్రభుత్వం పోస్టులను అమ్ముకుందని ఆరోపించారు. ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పారదర్శకతకే పెద్దపీట'


