హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జేసీ

SS: జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గోరంట్ల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మ్యుటేషన్ అప్లికేషన్లను నిర్దేశిత గడువులోగా పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు. రీ-సర్వే ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.