హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు పరిశీలించిన ఎంఈవో

ప్రకాశం: కంభంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను ఎంఈవో సత్తార్ పరిశీలించారు. వైద్య సిబ్బంది విద్యార్థుల ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్‌ తదితర పరీక్షలు నిర్వహించి వివరాలను నమోదు చేశారు. ఆరోగ్య సమస్యలున్న విద్యార్థులను గుర్తించి అవసరమైన చికిత్స అందించాలని ఎంఈవో సూచించారు.