SKLM: మెలియాపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్(EMRS)ను ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ గురువారం పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్య, వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈఎంఆర్‌స్‌ను పరిశీలించిన ఐటీడీఏ పీవో


