హైదరాబాద్: 28°C
వ్యాపారం

అన్ని ఎయిర్‌లైన్ల పైలట్లకు డ్రగ్‌ టెస్టులు: డీజీసీఏ

ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్‌లైన్ల పైలట్లకు వన్-టైమ్ డ్రగ్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని ఆదేశించింది. వచ్చే ఏడాది జూలై నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలని విమానయాన సంస్థలకు సూచించింది. గత నెలలో ఎయిరిండియా పైలట్‌కు డ్రగ్ పాజిటివ్‌గా రావడంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.