హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో హ్యాకథాన్‌కు శ్రీకారం

అన్నమయ్య: మదనపల్లెలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (SIH)-2026 కోసం అంతర్గత హ్యాకథాన్‌ను ఇవాళ ప్రారంభించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.